డైరెక్టరీని టెర్మినల్ ద్వారా చూసినపుడు ఆ డైరెక్టరీకి సంబంధించిన సూక్ష్మ విషయాలు పరికించవచ్చు.
ls : డైరెక్టరీని స్థూలంగా చూపు(దస్త్రాలను, సంచయాలనూ చూపిస్తుంది)
ls -l : డైరెక్టరీని విస్తృతంగా చూపు
ఉదాహరణకు :
$ ls -l
drwxr-xr-x 4 grp user1 1024 Jun 18 09:40 file1
-rw-r--r-- 1 grp user1 767392 Jun 6 14:28 file2
^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^
| | | | | | | | | | |
| | | | | యజమాని సమూహం పరిమాణం తేదీ సమయం పేరు
| | | | ఈ దస్త్రానికి లేదా సంచయానికి గల లంకెల సంఖ్య
| | | మిగితా వారికి అనుమతులు
| | యజమాని సమూహానికి అనుమతులు
| యజమానికి అనుమతులు: r =చదవవచ్చు, w = మార్చవచ్చు, x = ఆడించవచ్చు -=ఏ అనుమతీ లేదు
దస్త్రం రకం: - = మామూలు దస్త్రం, d=డైరెక్టరీ, l = సింబాలిక్ లింక్
ls -a : దాచి ఉంచిన దస్త్రాలతో సహా చూపించు(దాచి ఉంచిన దస్త్రాలు పేరు ముందు . కలిగి ఉంటాయి)
No comments:
Post a Comment