Sunday, March 18, 2012

లినక్స్ ఉద్యోగుల కొరత

ప్రపంచంలో ఏ దేశపు ఆర్ధిక వ్యవస్థ తీసుకున్నా సరే, ఆయా దేశాల్లో(భారతదేశం సహా) ఐటీ రంగమే మెరుగయిన ఉద్యోగావకాశాలను అందిస్తుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే అమెరికా లో 8 శాతం ఉన్న సగటు నిరుద్యోగుల సంఖ్య, ఐటీ రంగానికి కేవలం 2 శాతమే ఉంది. అలానే ఈ ఐటీ ఉద్యోగాల్లో సింహ భాగం లినక్స్ సంబంధిత ఉపకరణాల పై ఆధారపడి ఉంది. సిస్ అద్మిన్లు, మొదలు పబ్లిషింగ్ చేసే వారు కూడా లినక్స్ జ్ఞానం కలవారాయ్ ఉండాలన్నది బయటకు చెప్పని నిజం. అయితే ఈ సందర్భంలో లినక్స్  ఫౌండేషన్ వారు ఒక చిన్న నివేదికను విడుదల చేసారు. అది ఇక్కడ పరిశీలించండి. 


ప్రపంచ వ్యాప్తంగా ప్రతి కంపెనీ లినక్స్ లో నిష్ణాతులయిన ఉద్యోగులు కావాలి. కానీ మన విద్యార్థులు ఏమి చేస్తున్నారు? చేతి కింద ఉన్న అవకాశాన్ని ఎందుకు జార విడుస్తున్నారు?

ఈ టపాను పంచుకోండి